మెదక్ జిల్లా అచ్చంపేటలో అ.ని.శా విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మంత్రి ఈటలపై ఫిర్యాదు చేసిన రైతులను ఒక్కొక్కరిగా పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. ఈటల తమ భూములు కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు. మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్ సర్వే చేస్తున్నారు. మంత్రి హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లో సైతం డిజిటల్ సర్వే కొనసాగిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలతో భూములు సర్వే జరుపుతున్నారు.
మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో అధికారుల డిజిటల్ సర్వే - minister etela latest news

09:43 May 01
మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో అధికారుల డిజిటల్ సర్వే
ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని నిన్న సీఎంకు రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుపై సమగ్ర విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ పాల్గొన్నారు. అచ్చంపేటలో ఈ మేరకు భూములు అధికారులు సర్వే చేస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ నేతృత్వంలో భూముల సర్వే కొనసాగుతోంది.
అచ్చంపేట, హకీంపేట ప్రాంతాల మధ్య, మంత్రి ఈటల ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు ఇప్పటికే మోహరించారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు బలగాలు చేరుకున్నాయి.
ఇదీ చూడండి :మంత్రి ఈటలకు మద్దతుగా అభిమానుల ఆందోళన