హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఓ కుటుంబం నివాసముంటుంది. ప్రమాదవశాత్తు ఏసీ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
అపార్టుమెంట్లో పేలిన ఏసీ.. స్వల్ప అగ్ని ప్రమాదం - జూబ్లీహిల్స్ వార్తలు
జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏసీ పేలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలు అర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
జూబ్లీహిల్స్‌లో పేలిన ఏసీ.. స్వల్ప అగ్ని ప్రమాదం