హైదరాబాద్ జాంబాగ్ కార్పొరేటర్‌పై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జాంబాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన భాజపా అభ్యర్థి రాకేశ్ జైస్వాల్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా... ఎన్నికల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని ఎంఐఎం అభ్యర్థి జడల రవీందర్ కోర్టును ఆశ్రయించారు.
భాజపా కార్పొరేటర్‌ను తొలగించాలని ఎంఐఎం ఫిర్యాదు - తెలంగాణ వార్తలు
జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన అభ్యర్థి రాకేశ్ జైస్వాల్‌పై కేసు నమోదైంది. సంతానం విషయంలో ఎన్నికల వేళ తప్పుడు సమాచారం ఇచ్చారని ఎంఐఎం అభ్యర్థి జడల రవీందర్ కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
![భాజపా కార్పొరేటర్‌ను తొలగించాలని ఎంఐఎం ఫిర్యాదు abids-police-case-file-on-jambagh-corporator-rakesh-jaiswal-due-to-false-information-on-election-time-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10400501-thumbnail-3x2-bjp---copy.jpg)
సంతానం విషయంలో తప్పుడు వివరాలు... కార్పొరేటర్‌పై కేసు నమోదు!
ప్రత్యర్థి రవీందర్‌పై 82 ఓట్ల తేడాతో రాకేశ్ జైస్వాల్ గెలుపొందారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అమానవీయం.. చెల్లెలిపై అన్న అత్యాచారం!