రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం (Rape And Murder) చోటు చేసుకుంది. భర్తకు మందు తాగించి.. వివాహితను అత్యాచారం చేసి.. ఆపై చంపేశారు ఇద్దరు కీచకులు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సిద్ధమనుకున్న తర్వాత ముగ్గురు కలిసి మద్యం తాగారు.
Rape And Murder: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం - abdullapurmet rape and murder news latest

12:13 November 23
పోలీసుల అదుపులో నిందితులు!
అక్కడే ఇంట్లోనే ఉన్న భార్యపై కన్నేసిన ఇద్దరు స్నేహితులు.. ఆమె భర్తకు మరింత మద్యం తాగించారు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత.. ఇద్దరు కలిసి వివాహితపై అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించిన ఆ మృగాలు కనికరించలేదు. మరింత రెచ్చిపోయి ఆమెను హత్యచేశారు (Rape And Murder).
మత్తు నుంచి తేరుకున్న అతను విగతజీవిగా పడి ఉన్న భార్యను చూశాడు. ఏమి జరిగి ఉంటుందని ఓ అంచనాకు వచ్చాడు. వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్‌తో విచారణ చేపట్టారు. నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:High Tension in GHMC Head Office: 'కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి.. కార్పొరేటర్స్ ఫండ్ విడుదల చేయాలి'