ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో చోటు చేసుకుంది. మహేశ్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన హరికృష్ణ... మరో ఇద్దరు యువకులతో కలిసి కర్రలతో దాడి చేశాడు. మహేశ్ స్పృహ కోల్పోగా చనిపోయాడని భావించి అక్కడి నుంచి పరారైనట్లు బంధువులు తెలిపారు.
యువకుడిపై దాడి... ప్రేమ వ్యవహారమే కారణమా..? - Vikarabad District latest News
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో ఓ యువకుడిపై దాడి జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న మహేశ్‌ను చికిత్స కోసం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై దాడి
తీవ్ర గాయాలతో ఉన్న మహేశ్‌ను కుల్కచర్ల పోలీసు స్టేషన్‌కు తరలించి... అక్కడి నుంచి చికిత్స కోసం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణంగా తెలుస్తోంది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య