young man commits suicide: గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అల్వాల్లో నివాసముండే సాకేత్ కుమార్(28) రెెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు హాజరయ్యాడు. అందులో సరిగ్గా రాయలేదని మనస్థాపం చెందాడు. దీంతో నిన్న అతని ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందరూ ఇంట్లో ఉండటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువకుడు ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు
Young man commits suicide: గ్రూప్-1 పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
![గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువకుడు ఆత్మహత్య A young man commits suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16677845-272-16677845-1666076987202.jpg)
A young man commits suicide
ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సాకేత్ గౌడవెల్లి ఓఆర్ఆర్ పక్కన పెట్రోల్ పోసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరీక్ష బాగా రాయనందుకే ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: