తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉపవాసం వద్దన్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య! - తెలంగాణ వార్తలు

'ఉపవాసాలు చేయడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. నీరసం వస్తుంది' అని తన అక్క చెప్పిన మాటలు ఆమెకు నచ్చలేదు. అక్కతో ఘర్షణ పడింది. మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ విషాద ఘటన బేగంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

A young woman who was upset and tried to commit suicide, died at the hospital while receiving treatment in hyderabad
ఉపవాసం వద్దన్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య!

By

Published : Mar 22, 2021, 2:14 PM IST

ఉపవాసం వద్దన్నందుకు మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన బేగంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. గుంటూరు పట్టణానికి చెందిన దేవీనాగమ్మ(19) తన ఇద్దరు అక్కలతో కలిసి ప్రకాశ్​ నగర్​లో నివాసం ఉంటుంది. ఓ సోదరి భర్త నిర్వహించే కొరియర్ కార్యాలయంలో పనిచేస్తోంది.

ప్రతి సోమవారం ఉపవాసం చేసే అలవాటున్న నాగమ్మను ఈ నెల 9వ తేదీన రెండవ అక్క మందలించింది. ఉపవాసాలు చేయడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని, నీరసం వస్తుందని చెప్పడం వల్ల మనస్తాపం చెంది.. నాగమ్మ తన సోదరితో ఘర్షణ పడి ఇంటికి వెళ్లింది.

ఇంట్లో ఉరివేసుకున్న సమయంలో అప్పుడే వచ్చిన అక్కా, బావ కొన ఊపిరితో ఉన్న నాగమ్మను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల చికిత్స అనంతరం గాంధీ ఆసుపత్రికి మార్చారు. చికిత్స పొందుతూ ఆదివారం నాగమ్మ మృతి చెందింది. ఆమె సోదరి హిమజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్​స్పెక్టర్ చెప్పారు.

ఇదీ చూడండి: షూటింగ్ ప్రపంచకప్​లో భారత్​కు మరో స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details