ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి రూ. రెండు లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు. అంతటితో ఆగకుండా బాధితుడికి బెదిరింపులు ఎదురయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న ఆ యువకుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫేస్బుక్లో రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా... సదురు యువకుడు యాక్సెప్ట్ చేశాడు. ఇరువురు వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయం కాస్త శ్రుతి మించింది. యువతి.. యువకుడికి వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి తన దుస్తులను తొలగించేది. సదురు యువకుడిని కూడా దుస్తులను తొలగించమని కోరేది. అలా దుస్తులు తీసేసిన తర్వాత... తతంగాన్నంతా రికార్డు చేసేది.