Young Woman Suicide in Alair : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో దారుణం జరిగింది. తనపై నలుగురు వ్యక్తులు తనను ఆగం చేశారని సూసైడ్ నోట్ రాసి... ఆత్మహత్యకు యత్నించిన యువతి... మంగళవారం మృతి చెందింది. నలుగురు వ్యక్తులు యువతి ఈ నెల 18న పురుగుల మందు తాగి... ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితురాలు... మంగళవారం రాత్రి మృతి చెందింది.
గ్రామంలో బందోబస్తు...
యువతి ఆత్మహత్యకు కారణమైన ఆ నలుగురు వ్యక్తుల పేర్లను సూసైడ్ నోట్లో రాసిందని పోలీసులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పేర్లు సూసైడ్ నోట్లో ఉన్నాయని వెల్లడించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ నలుగురు వ్యక్తుల్లో ఎంపీటీసీ భర్త, ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ ఆటో డ్రైవర్, ఓ పూల వ్యాపారి ఉన్నారని పోలీసులు తెలిపారు.