సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాలలో ప్రేమించి మోసం చేసిన వ్యక్తి ఇంటి వద్ద యువతి మౌనపోరాటం చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి... ఇప్పుడు రెండుకోట్లు వరకట్నంగా ఇస్తేనే వివాహం చేసుకుంటానని ముఖం చాటేశాడని యువతి ఆరోపిస్తోంది. గ్రామానికి చెందిన వెలుగు సతీశ్.. అదే గ్రామానికి చెందిన యువతి చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి మాటెత్తగా... యువకుడు ముఖం చాటేశాడు. ఈ విషయమై యువతి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ ఇచ్చారు.
ప్రియుడి ఇంటి వద్ద యువతి మౌనపోరాటం - తెలంగామ తాజా వార్తలు
పెళ్లిచేసుకుంటానని చెప్పి... ప్రేమ వ్యవహారం నడిపించి.. ఆపై రెండు కోట్ల రూపాయలు ఇస్తేనే వివాహమాడతానంటూ ముఖం చాటేసిన వ్యక్తి ఇంటి వద్ద యువతి మౌనపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లాలోని కరివిరాలలో ప్రియుడి ఇంటి వద్ద బంధువులతో ఆందోళనకు దిగింది.
ప్రియుడి ఇంటి వద్ద యువతి మౌనపోరాటం
అయితే గతేడాది సతీశ్‌కు ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి తనను దూరం పెట్టాడని.. వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి సతీశ్ ఇంటి వద్ద మౌనపోరాటానికి దిగింది. రెండు కోట్ల రూపాయలు వరకట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
ఇదీ చూడండి:అవన్నీ లేకున్నా ప్రేమించిన వారితో ఆనందంగా గడపడింలా