తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide in Rangareddy district: యువతి బలవన్మరణం.. న్యూడ్ వీడియోలే కారణమా?

Suicide in hyderabad, A young woman committed suicide in Rangareddy district
యువతి బలవన్మరణం.. న్యూడ్ వీడియోలే కారణమా?, యువతి సూసైడ్

By

Published : Nov 5, 2021, 12:30 PM IST

Updated : Nov 5, 2021, 1:05 PM IST

12:27 November 05

యువతి బలవన్మరణం.. న్యూడ్ వీడియోలే కారణమా?

అరెస్టయిన కార్తీక్‌

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి విఫలమవడంతో ఉరేసుకొని ఆత్మహత్య(Suicide in Rangareddy district) చేసుకున్న ఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెండ్యాలకు చెందిన యువతికి... పక్క గ్రామమైన అమీర్​పేటకు చెందిన కార్తీక్‌తో ఏడాది క్రితం నిశ్చితార్థం అయింది. ఆమె తండ్రి చనిపోవడంతో  విహహం వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 17న వివాహం జరగాల్సి ఉంది. కాబోయే భార్యభర్తలనే ఉద్దేశంతో ఇద్దరు చనువుగా మెలిగారు. యువతితో కలిసి వాట్సాప్‌లో నగ్నంగా మాట్లాడిన కార్తీక్ రహస్యంగా తన చరవాణిలో చిత్రీకరించాడు. 

కట్నకానుకల విషయంలో తేడా వచ్చి ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. కార్తీక్ వద్ద రహస్య దృశ్యాలు ఉండటం తెలుసుకున్న యువతి అవమానం తట్టుకోలేక గత నెల 19న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కార్తీక్‌ను సెక్షన్ 306కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Blast in Hyderabad: గుంత తీసి.. ఒకేసారి ఐదు బాంబులు పెట్టారు..!

Last Updated : Nov 5, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details