కుటుంబ కలహలతో ఓ మహిళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడ ఉన్న రివర్ గార్డ్స్, రెస్క్యూ సిబ్బంది తాడు సహయంతో ఆమెను కాపాడారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కాసిపేటకు చెందిన దాసరి శోభ అనే వివాహిత కుటుంబ గొడవలతో గోదావరిలో దూకింది. శివరాత్రి సందర్భంగా అక్కడే విధులు నిర్వహిస్తున్న రెస్క్యూ టీంకు చెందినా వ్యక్తి మునిగిపోతున్న మహిళను తాడుతో రక్షించారు.