సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. పీజీ ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశానికి గురైన ఆ యువతి బంగారు భవిష్యత్తును బలి తీసుకుంది. హుస్నాబాద్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన హంసిని(23) ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
YOUNG WOMAN SUICIDE: మార్కులు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య - యువతి ఆత్మహత్య
పీజీ ఎంట్రన్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ యువతి బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.
పట్టణానికి చెందిన వేల్పుల ఆనందం, సునీత దంపతులకు హంసిని పెద్ద కుమార్తె కాగా.. మరో కుమారుడు ఉన్నారు. ఆనంద్ ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల నుంచి పీజీ ఎంట్రెన్స్‌లో తక్కువ మార్కులు రావడంతో.. మంచి కాలేజీలో సీటు రాదని తన తల్లికి చెబుతూ బాధపడుతూ ఉండేదని యువతి తండ్రి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: