ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి, కుటుంబ సభ్యులపై కత్తి, రాడ్లతో దాడి - ప్రియురాలి కుటుంబసభ్యులపై కత్తితో ప్రియుడి దాడి
21:42 October 23
ప్రేమోన్మాది ఘాతుకం
Youngman attack on Young woman and Family: ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రేమ పేరిట ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. నిశ్చితార్థమైన యువతిని ప్రేమిస్తున్నానంటూ.. పేరం ఏడుకొండలు అనే వ్యక్తి కొన్నాళ్లుగా వేధించాడు. ప్రేమను నిరాకరించిందని ఆమెపై ఆగ్రహం పెంచుకున్న ఏడుకొండలు... యువతిపై, ఆమె కుటుంబ సభ్యులపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశాడు. మొత్తం 12 మందిని గాయపరిచాడు. ఈ ఘటనలో యువతితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా.. స్వల్పంగా గాయపడిన 9 మందిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: