తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రేమికులు అనే ముద్ర.. తట్టుకోలేక యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం.. - నిజామాబాద్‌లో విషాదం

A young woman and a young man attempted suicide for being labeled as lovers in nandipet, nizamabad district
ప్రేమికులు అనే ముద్ర.. తట్టుకోలేక యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం..

By

Published : Aug 10, 2022, 11:45 AM IST

Updated : Aug 10, 2022, 12:14 PM IST

11:40 August 10

ప్రేమికులు అనే ముద్ర.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం

ఓ యువతి, యువకుడు కొంచె చనువుగా మెలిగితే చాలు.. ప్రేమికులు అనే సందేహం వస్తోంది. అంతేందుకు అన్నా చెల్లెలు బైక్‌పై వెళ్లినా... ఈ సోసైటీ లవర్స్‌ అంటూ ట్యాగ్‌ ఇచ్చేస్తారు. అయితే వీటిని చాలా మంది లైట్ తీసుకున్నా... సున్నిత మనస్కులు తీసుకోలేరు. ఇలాంటి ఘటనే నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.

నిజామాబాద్‌లో నందిపేట్‌ మండలానికి చెందిన ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. యువతి, యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. యువకుడు వినయ్‌కుమార్‌ మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువతికి నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిపై ప్రేమికులు అనే ముద్ర వేసినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Last Updated : Aug 10, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details