పట్టణానికి చెందిన ఖలీమ్.. బీట్ మార్కెట్ వద్ద మిర్చి బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే పనుల్లో ఉండగా.. బంధువైన వసీం ఒక్కసారిగా అతనిపై కత్తితో దాడి చేశాడు. వీపు, చేతులపై బలంగా పొడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంధువుపై.. కత్తితో దాడికి పాల్పడ్డ యువకుడు - బంధువుపై కత్తితో దాడి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో.. బంధువుపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

attacked with a knife
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో బంధువుపై ఓ యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గాయాల పాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:ఏటీఎం సిబ్బందిని తుపాకీతో కాల్చి చోరీ