సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం రేపింది. నిన్న రాత్రి సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి యువకుడు మృతి (young man was killed when an airgun exploded) చెందాడు. ప్రమాదవశాత్తు యువకుడి చేతిలో ఎయిర్‌గన్ పేలడంతో... యువకుడి తలకు బలంగా తాకింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే... ఆ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.
Airgun Exploded News: చేతిలో పేలిన ఎయిర్‌గన్.. యువకుడు మృతి - సలాఖపూర్‌లో చేతిలో పేలిన ఎయిర్‌గన్
![Airgun Exploded News: చేతిలో పేలిన ఎయిర్‌గన్.. యువకుడు మృతి A young man was killed when an airgun exploded in his hand at salakhapur, siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13544081-923-13544081-1636001686000.jpg)
10:17 November 04
సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ కలకలం
మృతుడు హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ముసాఫ్‌గా గుర్తించారు. స్నేహితులతో కలిసి సలాఖపూర్‌లో బంధువుల ఇంటికి ముసాఫ్ వెళ్లగా... అక్కడ జరిగిన ఈ ప్రమాదం అతన్ని బలితీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
''ఎయిర్‌గన్ మిస్ ఫైర్ అయినట్లు సమాచారం అందింది. వెంటనే సలాఖపూర్కు వెళ్లాం... ముసాఫ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి... స్నేహితులతో కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. గన్ మిస్‌ఫైర్ అవడంతో.. చనిపోయినట్లు దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని సిద్దిపేట ఆసుపత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకున్నాం.. ''
- మద్దూర్, ఎస్ఐ