young man murdered in karimnagar: చెల్లెలిపై ఉన్న ప్రేమ.. ఆ యువకుడిని హంతకుడిగా మార్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెంకు చెందిన శివరామకృష్ణ సోదరిని అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరుడు సంతోష్‌ను పలుమార్లు వారించాడు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో శివరామకృష్ణ కక్షపెంచుకున్నాడు.
చెల్లెలిపై ప్రేమ.. ఆపై హంతకుడిగా మారిన అన్నయ్య - హత్య
young man murdered in karimnagar: చెల్లెలిపై ఉన్న ప్రేమ.. ఆ యువకుడిని హంతకుడిగా మార్చింది. తన సోదరిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడని తెలుసుకున్న అన్నయ్య పలుమార్లు వారించాడు. అయినా అతని తీరు మారకపోవడంతో.. చివరికి తానే రంగంలోకి దిగి హంతకుడిగా మారాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
దాంతో జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌక్ సమీపంలో ఓ మద్యం షాపులో మద్యం సేవిస్తున్న సంతోష్‌ను ఒంటరిగా ఉండడం గమనించిన శివరామకృష్ణ కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో శివరామకృష్ణ అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జమ్మికుంట సీఐ రాంచంద్రరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంతోష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.