తెలంగాణ

telangana

ETV Bharat / crime

ట్రాక్టర్​ను ఢీకొన్న బైక్​.. వ్యక్తి మృతి - నారాయణ పేట జిల్లా నేరాలు

నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

young man was killed in a road accident
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

By

Published : May 24, 2021, 10:52 PM IST

వేగంగా వచ్చిన ఓ బైక్​.. ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలంలో చోటుచేసుకుంది. మక్తల్ పట్టణానికి చెందిన పవన్(30), బంధువైన మరో బాలుడు నరేశ్(10)తో.. వివాహ వేడుకలకు హాజరై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితుడి బంధువులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న బాలుడిని.. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details