కంకర క్వారీలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జరిగింది.
ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో అదుపుతప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tractor overturned
స్థానికులు.. క్షతగాత్రులను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..!