సంగారెడ్డి జిల్లా కంగి మండలంలోని గాజులపాడ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆ ఊరిలో మైసమ్మ బోనాల ఉత్సవాలకు నీరు తరిలిస్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందాడు. వాహన చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
చోదకుడు జయరాం అజాగ్రత్తగా, అతివేగంగా వాహనం నడపడంతో రోడ్డుపై బోల్తా పడిందని కంగి ఎస్సై అబ్దుల్ రఫీక్ వెల్లడించారు. ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న తండాకు చెందిన సంతోశ్ (18) ట్రాక్టర్ ఇంజన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.