తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

నల్గొండ జిల్లా చండూర్​ మండలం పుల్లెంలా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణ వార్తలు
నల్గొండ నేర వార్తలు

By

Published : Apr 28, 2021, 10:46 AM IST

ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్​ రాకపోవడం వల్ల మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చండూర్ మండలం పుల్లెంలా గ్రామానికి చెందిన పాక శ్రీకాంత్ తెలంగాణ యూనివర్సిటీలో పీజీ చదివాడు. రెండేళ్ల నుంచి నల్గొండలోని ఓ గదిలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్​ అవుతున్నాడు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం.... ఉద్యోగ నోటిఫికేషన్​ ఇవ్వకపోవడం వల్ల మనస్తాపంతో పురుగుల మందుతాగు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

శ్రీకాంత్​ తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లికి మానసిక స్థితి సరిగా లేదు. సోదరుడు చదువుకుంటున్నాడు. ఓవైపు ఇంట్లో పరిస్థితులు... మరోవైపు కొలువు వస్తుందన్న ఆశలేక మనస్తాపంతో తమ వ్యవసాయ పొలం వద్ద పురుగులమందు తాగాడు. గుర్తించిన స్థానికులు నల్గొండలోని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details