నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. లారీ కింద ఇరుక్కుపోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను సురక్షితంగా బయటపడటానికి సుమారుగా 45 నిమిషాల సమయం పట్టింది. జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చౌరస్తా ప్రధాన రహదారిపై లారీ.. రివర్స్ గేర్‌లో కిరాణా షాపులకు వస్తువులు డంపు చేస్తోంది. ఆ సమయంలో స్థానికంగా నివసించే మైబుస్ లారీ వెనుక వైపు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు టైర్ కింద పడిపోయాడు. వెంటనే డ్రైవర్ బ్రేక్ వేసినా.. అప్పటికే మైబుసు కాలు టైర్ మధ్యభాగంలో ఇరుక్కుపోయింది. పరిస్థితి దయనీయంగా మారి.. బాధితుడు ఆర్తనాదాలు చేశాడు.
లారీ టైర్ల మధ్యలో ఇరికి యువకుడి క్షోభ.. చివరికి.! - A young man stuck in the middle of the lorry wheels
ప్రమాదవశాత్తు లారీ చక్రాల మధ్యలో ఓ యువకుడు ఇరుక్కుపోయాడు. దాదాపు 45 నిమిషాలు స్థానికులు శ్రమించిన అనంతరం అతను సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీ టైర్ల మధ్యలో ఇరికిన యువకుడు
డ్రైవర్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక దశలో జేసీబీతో యత్నించినా కాపాడలేకపోయారు. చివరికి స్థానికులు చాకచక్యంగా బాధితుడిని రక్షించగలిగారు. ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:Ministers Fire: ఓనర్లమని చెప్పి క్లీనర్‌గా మారావ్..