Rape on Minor Girl: రోజురోజుకి మహిళలు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. మనిషి అని మర్చిపోయిన కామాంధులు.. వారి దాహానికి చిన్న పిల్లలు బలియి పోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్‌కి చెందిన దేవదాస్ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
Rape on Minor Girl: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
rapes a girl
బాలిక గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గమనించిన తల్లీదండ్రులు బాలికను ఆరాతీయగా ఏడుస్తూ వివరించింది. తల్లిదండ్రులు ఓ పరిశ్రమలో పనికి వెళ్లిన సమయంలో ఇంటి పక్కనే ఉన్న దేవదాస్ తరచు బాలికపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకుడుని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: