తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెల్లెలికి చేతబడి చేశాడనే అనుమానంతో.. పెద్దనాన్న హత్య - మంత్రాల నెపంతో హత్య

దేశం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నా... మారుమూల గ్రామాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. పక్కవారు అనారోగ్యానికి గురైతే.. బాణమతి, చేతబడి చేశారని అనుమానం పెంచుకుంటున్నారు. దీనికి.. పాతకక్షలూ తోడవడంతో వాటిని పగలుగా మార్చుకుని, వారి ప్రాణాలు తీస్తున్నారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తిలోని ఓ తండాలో.. ఇలాగే ఓ యువకుడు, పెద్దనాన్నపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.

witchcraft crimes
చేతబడి హత్య

By

Published : Apr 8, 2021, 10:59 PM IST

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడు.. సొంత పెద్దనాన్ననే కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.

చెల్లెలికి చేతబడి చేశాడని..

జలాల్‌పురం తండాకు చెందిన నరసింహ.. ఇటీవల తన సోదరి అనారోగ్యానికి గురికాగా వైద్యం చేయిస్తున్నాడు. చెల్లెలి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అందుకు కారణం పెద్దనాన్న చేసిన చేతబడే అని భావించి పగ పెంచుకున్నాడు.

పెద్దమ్మ కళ్ల ఏదుటే..

సాయంత్రం సమయంలో నరసింహా.. పొలం వద్ద పనులు చేసుకుంటున్న కిషన్ వద్దకు వెళ్లాడు. పెద్దమ్మ కళ్ల ఏదుటే.. అతనిని కత్తితో పొడిచి చంపాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:దారుణం: భార్యను హతమార్చిన భర్త

ABOUT THE AUTHOR

...view details