తెలంగాణ

telangana

ETV Bharat / crime

మోతె శివారులో యువకుడి హత్య - జగిత్యాల జిల్లా వార్తలు

ఓ యువకుడిని తోటి స్నేహితులే హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా మోతె గ్రామ శివారులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

murder
యువకుడి హత్య

By

Published : May 7, 2021, 2:43 AM IST

జగిత్యాల జిల్లా మోతె గ్రామ శివారులో బక్కశెట్టి రాజు అనే 20 ఏళ్ల యువకుడిని తోటి స్నేహితులే కత్తులతో పొడిచి హతమార్చారు. మోతె శివారులో పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో గురువారం రాత్రి 10 మంది వరకు కలిసి మద్యం సేవించారు.

అందులో కొందరు రాజుపై కత్తులతో పొడిచారు. తీవ్రగాయాలైన అతన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించేలోపే మృతి చెందాడు. హత్యకు పాత కక్షలు లేదా ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:'రాజకీయ నేతగా రాలేదు... ఈటలకు ధైర్యం చెప్పేందుకు వచ్చా'

ABOUT THE AUTHOR

...view details