తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగింది. ఖైత్లాపూర్‌లో పాలవ్యాపారం చేసుకునే శ్రీకాంత్(26)ను అతని స్నేహితుడు శ్రీశైలం దారుణంగా చంపేశాడు.
కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు

ఖైత్లాపూర్‌లో నివసించే శ్రీకాంత్(26) ఈనెల 1న అదృశ్యమైనట్లు అతని కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అతడు శ్రీశైలం భార్యతో ఎక్కువగా మాట్లాడటం జరిగిందని నిర్ధారించారు. అతడు చివరిసారిగా శ్రీశైలంతో కనిపించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో నేరాన్ని అంగీకరించినట్లు కూకట్పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.
ఈనెల 1న తేదీన ఐడీఎల్ కంపెనీ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు శ్రీశైలం పోలీసులకు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
ఇదీ చూడండి:Honey Trap: బావ.. మరదలు.. ప్రియుడు.. మధ్యలో ఓ సుబ్బు.. వలపు వలతో కోటి కాజేశారు!