ఆన్లైన్లో లోన్ కోసం యత్నించి రూ. 1.12 లక్షలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్‌కు చెందిన యువకుడు.. డబ్బులు అవసరం ఉన్నాయంటూ ఆన్లైన్లో లోన్ కోసం వెతికాడు. దానికి సంబంధించిన ఓ యాప్‌లో యువకుడు వివరాలు పొందుపరిచాడు. ఆ వెంటనే ఓ మహిళ ఫోన్ చేసి రూ. 3 లక్షలు లోన్ మంజూరైందంటూ యువకుడిని నమ్మించింది.
Loan app: ఆన్లైన్ లోన్ కోసం యత్నం.. యువకుడి కొంపముంచింది..! - a young man lost one lakh twelve thousand rupees through online loan app
ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా లోన్ కోసం యత్నించి అప్పు మూటకట్టుకున్నాడు ఓ యువకుడు. విడతల వారిగా రూ.లక్షకు పైగా పోగొట్టుకున్నాడు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆన్లైన్ లోన్ యాప్
లోన్ ప్రాసెసింగ్‌లో ఉందని బాధితుడిని నమ్మించి ఛార్జీల రూపంలో విడతల వారీగా రూ. లక్షా 12వేలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. అనంతరం స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు.. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:rs praveen kumar: త్వరలోనే ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు..!