A Young man killed in Mahamkali at Secunderabad: స్నేహితుల మధ్య ఘర్షణ కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్‌గ్యాస్ మండిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం శివాజీ అనే యువకుడు స్నేహితుడు పుట్టినరోజు ఉందని, ఇంటికి వచ్చే సరికి ఆలస్యం అవుతుందని తన తల్లికి చెప్పి బయటకి వెళ్లాడు. పుట్టినరోజు వేడుకల్లో వారి స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో భాగంగా తన స్నేహితులు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్నేహితుల మధ్య గొడవ.. యువకుడు బలి - A young man killed at mahankali police station
A Young man killed in Mahamkali at Secunderabad: ఈ లోకంలో స్నేహం కన్నా గొప్పది లేదని కొందరు అంటుంటారు. అలాంటి స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలే ప్రమాదాలకి దారితీస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అదే విధంగా సికింద్రాబాద్‌లోని స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఒకరి ప్రాణం పోయింది. ఆ యువకుడిని హత్య చేయడానికి కారణం ఏమిటి? పాత గొడవలేనా..! లేదా మద్యం మత్తులో జరిగిందా?
మృతి చెందిన యువకుడు శివాజీ
ఈ హత్య సుమారు రాత్రి 12 గంటల సమయంలో జరిగిందని మహంకాళి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. ఘటనస్థలిలో మద్యం బాటిల్లు కూడా లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. మద్యం మత్తులోనే హత్య జరిగి ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: