వాగులో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని స్థానికులు రక్షించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో హల్దీ వాగు పూర్తిగా నిండిపోయింది. తూప్రాన్ మండలం కిష్టాపూర్ వంతెన పైనుంచి వెళ్తోన్న ద్విచక్ర వాహనదారుడు నీటి ఉద్ధృతికి అదుపు తప్పి వాగులో పడిపోయాడు. అటుగా వెళ్తోన్న స్థానికులు.. బాధితుడితో పాటు బైక్‌ను బయటికి తీసి రక్షించారు.
వాగులో కొట్టుకుపోయిన యువకుడు.. కాపాడిన స్థానికులు - కొండపోచమ్మ జలాశయం
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఓ యువకుడు బైక్‌తో సహా వాగులో మునిగిపోయాడు. అటుగా వెళ్తోన్న స్థానికులు.. బాధితుడితో పాటు బైక్‌ను బయటకు తీసి రక్షించారు.
వాగులో కొట్టుకుపోయిన యువకుడు