భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. మండలగూడెం గ్రామానికి చెందిన భాను ప్రకాశ్(21) స్థానికంగా ఓ వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే నీటి సరఫరా చేసేందుకు వెళ్లిన భాను ప్రకాశ్‌కు.. ట్రాలీ డ్రైవర్‌కు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ తరువాత ప్రకాశ్ బుగ్గవాగులో దూకాడు.
తోపులాటలో వాగులో పడి.. యువకుడు మృతి - నీట మునిగి యువకుడు మృతి
ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో జరిగింది.

తోపులాటలో వాగులో పడి.. యువకుడు మృతి
ఘటన స్థలానికి చేరుకున్న బాధితుడి తండ్రి.. పోలీసు సిబ్బంది సాయంతో వాగులో తీవ్రంగా గాలించారు. అయితే అప్పటికే భాను ప్రకాశ్ చనిపోయాడు. ప్రాణాలతో బయటపడతాడనుకున్న కుమారుడు శవమై తేలడంతో.. తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:హయత్‌నగర్‌లో రోజువారి కూలీ దారుణ హత్య
Last Updated : Mar 26, 2021, 4:01 PM IST