మతిస్తిమితంలేని ఓ యువకుడు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో జరిగింది. గ్రామానికి చెందిన గాజుల పవన్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా మతిస్తిమితం సరిగా లేక చికిత్స పొందుతున్నాడు.
బావిలో పడి మతిస్తిమితం లేని యువకుడు మృతి - బావిలోపడి యువకుడు మృతి
యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గాజుల పవన్ (21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లిన పవన్... తర్వాత వస్తానని చెప్పడం వల్ల అతడిని అక్కడే వదిలేసి ఇంటికొచ్చేశారు. ఎంత సేపటికీ రాకపోయేసరికి పొలం వద్దకు వెళ్లి బావిలో చూడగా చెప్పులు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి నీటిని తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పవన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:నిషేధిత పొగాకు ఉత్పత్తుల ధ్వంసం