తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: డివైడర్​ను ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదాలు కారణాలు

హైదరాబాద్​ నగర శివారు​ రాజేంద్రనగర్​లోని పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ బైక్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
road accident

By

Published : Jun 14, 2021, 9:16 AM IST

వేగంగా వచ్చిన ఓ బైక్​.. అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగర శివారు​ రాజేంద్రనగర్​లోని పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్ హైవేపై జరిగింది.

మృతుడు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన వంశీ కృష్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. యువకుడు.. నిబంధనలకు విరుద్ధంగా హైవేపై ద్విచక్రవాహనాలకు అనుమతి లేకున్నా, హెల్మెట్ సైతం ధరించకుండా వెళ్లి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Murder: తండ్రిని చంపారని పగపెంచుకున్నారు.. ఏడాది తర్వాత రివైంజ్​

ABOUT THE AUTHOR

...view details