తెలంగాణ

telangana

ETV Bharat / crime

Youngman died in Metpally Accident : మద్యం మత్తులో డ్రైవర్.. యువకుడి ప్రాణాలు గాల్లో..! - cc footage of road accident

Youngman died in Metpally Accident : నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరిస్తున్నా... అలా చేసిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనం నడిపిన ఓ లారీ డ్రైవర్ కారణంగా.. యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Youngman died in Metpally Accident , road accident
మద్యం మత్తులో డ్రైవర్.. యువకుడి ప్రాణాలు గాల్లో..!

By

Published : Feb 1, 2022, 3:36 PM IST

Youngman died in Metpally Accident : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్‌... ఓ యువకుడి ప్రాణాలు తీశాడు. నిజామాబాద్ నుంచి కోరుట్ల వెళ్తున్న లారీ మెట్‌పల్లి ఆర్టీసీ డిపో వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. లారీ నుంచి డ్రైవర్‌ కిందపడిపోయాడు. అదుపు తప్పిన లారీ వేగంగా ముందుకు వెళ్లి.... ద్విచక్రవాహనం మీద వెళ్తున్న సంకీర్తన్‌ అనే యువకుడిపైకి దూసుకుపోయింది.

ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను ఆరా తీశారు. సీసీ ఫుటేజీ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్.. యువకుడి ప్రాణాలు గాల్లో..!

ఇదీ చదవండి: టోనీ వాట్సాప్ సందేశాలపైనే పోలీసుల నిఘా.. ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details