నారాయణపేట జిల్లా మక్తల్ మండలం టేకులపల్లిలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు మక్తల్ మండలం గుర్లపల్లికి చెందిన రమేశ్గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కారు, ట్రాక్టర్ ఢీ.. డ్రైవర్ మృతి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం టేకులపల్లిలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం, మక్తల్ రోడ్డు ప్రమాదం
మక్తల్ పట్టణం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. పులిమామిడి గ్రామం నుంచి మక్తల్ వైపు వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:Covid-19: 63రోజుల తర్వాత లక్ష దిగువకు కేసులు