నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తగిలి చిగుర్ల వెంకటేశ్ అనే చెంచు యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్రామానికి చెందిన చిగుర్ల వెంకటేశ్, బిచ్చమయ్యలు ఇద్దరు వన్యప్రాణుల షికారు కోసమని ఆదివారం రాత్రి అటవీ ప్రాంతానికి వెళ్లారు. కాటి చెలక బావి అటవీ ప్రాంతంలో గంటల శంకర్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు ప్రమాదవశాత్తు తగిలి వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.