కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపు తప్పి కాలువలో పడిపోయాడు. ఈ ఘటనతో తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. పోలీసులు వెంబడించడం వల్లే తమ కుమారుడు మరణించాడని అతని తండ్రి ఆరోపించారు. ఇవాళ ఉదయం తిమ్మాపూర్ నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసు సిబ్బందితో కలిసి సీఐ కృష్ణారెడ్డి వెంబడించినట్లు పేర్కొన్నారు.
'పోలీసులు వెంబడించడం వల్లే నా కుమారుడు మృతి చెందాడు'
కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన అనిల్ కూమార్ యాదవ్ అనే యువకుడు అదుపుతప్పి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు వెంబడించడం వల్లే తమ కుమారుడు మరణించాడని అతని తండ్రి ఆరోపించారు.
మానకొండూరులో యువకుడు మృతి, పోలీసులపై ఆరోపణలు
పోలీసులను చూసి వేగంగా వెళ్లడంతోనే తమ కుమారుడు కాలువలో పడి పోయాడని వాపోయాడు. తలకు తీవ్రగాయాలైన అనిల్ కుమార్ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా... కొద్దిసేపటికే మృతిచెందాడని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం