యజమాని చిత్రహింసలు పెట్టాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన అశోక్ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. స్థానికులు అతన్ని డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అశోక్ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. గత నాలుగేళ్లుగా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అశోక్ పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని వేధింపులకు గురి చేశాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
'నేను మందు తాగి చచ్చిపోతున్నా. దానికి కారణం మా సార్.. డ్యూటీలో నన్నే టార్గెట్ చేసి చేయకూడని పనులు చేయించుకుని.. బూతులు మాట్లాడి.. నన్ను టార్చర్ పెట్టేవాడు. అందుకనే.. మందుతాగి చచ్చిపోతున్నా..'- బాధితుడు.