తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రేయసి లేదని.. జీవితం ఇక చాలనుకొని యువకుడి మృతి.. ఎక్కడంటే.. - Warangal district latest news

young man committed suicide in love problems: అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయుడైన ఓ యువకుడికి అమ్మయి పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు అది యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకోగా.. అందరిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన యువకుడు.. జీవితంపై విరక్తి చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన జనగామలో జరిగింది.

young man committed suicide in love problams
young man committed suicide in love problams

By

Published : Jan 4, 2023, 7:26 PM IST

young man committed suicide in love problems: విధి ఎవరిని విడిచిపెట్టదు అందరితో ఆడుకుంటాది అంటారు. ఈ వ్యాఖ్య నిజమే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. నిరాశ్రయుడైన ఓ యువకుడికి ఓ అమ్మాయి పరిచయమైంది. అన్నింటాతాను తోడుగా ఉంటానని మాటిచ్చింది. ప్రేమను పంచింది, కష్టాల్లో తోడుగా ఉంటానని, చావువరకు నీతోనే కలిసి జీవిస్తానని ప్రమాణం చేసింది. కానీ చివరి క్షణంలో ఆమెకు ఓ యుద్ధం ఎదురైంది. అదే తల్లిదండ్రుల ప్రేమ.. ఆ యువకుడి ప్రేమ కావాలో తన ముందు ఓ పెద్ద సవాల్ ఎదురైంది.

మృతి చెందిన కావేరి, అరవింద్

అమ్మనాన్నలను విడిచిపెట్టుకోలేక ప్రియుడ్ని మోసం చేయలేక చివరికి ఆత్మహత్య శరణ్యం అనుకొని మృతి చెందగా.. ఆమె మరణంతో అరవింద్ కూడా తన వెంటే నా పయనం అంటూ ఈలోకాన్ని విడిచి పయనమయ్యాడు. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం జనగామ మండలం వెంకిర్యాలకు చెందిన ఇరుగు అరవింద్ వాళ్ల తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ బాధతో జీవిత పోరాటం చేస్తోన్న సమయంలో వడ్లకొండ గ్రామానికి చెందిన కావేరి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది.

తల్లితండ్రులతో దూరమైన ప్రేమ ఆ యువతిలో చూసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ విషయం యువతి తల్లిదండ్రుల వరకు చేరింది. వారు మందలించినా.. వారి ప్రేమను వదలుకోలేకపోయారు. తన ఇష్టాన్ని తల్లిదండ్రులు కాదన్నారని గత నెల 25న కావేరి ఉరివేసుకొని మృతి చెందింది. ఆగ్రహించిన కావేరి తల్లిదండ్రులు అరవింద్​ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో మనస్తాపానికి గురైన యువకుడు మరుసటి రోజు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అపస్మారక స్థితికి చేరిన అతన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్‌కు తరలించి మైరుగైన వైద్యం అందించారు. చివరగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details