Engineer Commits Suicide in Secunderabad: సికింద్రాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చంపాపేట్ సాయిరాంనగర్ నివాసం ఉండే మోహన్ కృష్ణ (24) ఓ సంస్థలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, అన్నయ్య, వదినలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అందుకుగాను అప్పులు చేశాడు.
ఆన్లైన్ బెట్టింగులకు బానిసై అప్పులపాలయ్యాడు.. కట్ చేస్తే చివరకు.. - బెట్టింగ్‌లో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య
Engineer Commits Suicide in Secunderabad: ఆన్లైన్ బెట్టింగ్‌కి అలవాటు పడి ఎంతో మంది యువకుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొంతమంది బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైపోతున్నారు. దీని ప్రభావంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తాాజాగా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది.
Engineer Commits Suicide in Secunderabad
ఇంటివద్ద నుంచే పని చేస్తున్న అతడు.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం బొల్లారం బజార్- అల్వాల్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువకుడు మృతదేహం రైలు పట్టాలపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభ్యమైన సెల్‌ఫోన్ ఆధారంగా మోహన్ కృష్ణగా తేల్చారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: