తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇంట్లో వేడుకకు రానంటావా, వీడియోకాల్‌ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య

Committed Suicide ఓ వ్యక్తి తన భార్యపై అలిగి ఆమెతో వీడియోకాల్ మాట్లాడూతూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని బంధువుల ఇంట్లో జరిగే బోనాల పండుగకు ఆమె రానని చెప్పడమే అందుకు కారణం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది

రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా

By

Published : Aug 15, 2022, 9:51 AM IST

Committed Suicide: ‘మీ బంధువుల వివాహాలకు నేను హాజరయ్యాను.. మా బంధువుల ఇంట్లో బోనాలకు నువ్వెందుకు రావడం లేదని’ భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పహాడీషరీఫ్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తుక్కుగూడలో ఉండే సాయి కార్తిక్‌గౌడ్‌(33), భార్యతో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడని చెప్పారు.

పుట్టింటివాళ్లు కావడంతో భార్య అక్కడే ఉండిపోగా కార్తిక్‌గౌడ్‌ శనివారం ఇంటికి వచ్చాడని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మీర్‌పేటలో జరిగే బోనాల పండగకి తన పిన్ని ఇంటికి వెళదామని భార్యకు పదే పదే ఫోన్‌ చేశాడని చెప్పారు. ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుందన్నారు. మనస్తాపంతో సాయి కార్తిక్‌ రవళికి వీడియో కాల్‌ చేసి మీ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర విందులకు నేను హాజరవుతున్నా.. తమ వాళ్ల వద్దకు నీవెందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పారు.

తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కార్తిక్‌గౌడ్‌ దూలానికి ఉరేసుకున్నాడని అన్నారు. ఆ సమయంలో ఫోన్‌ పడేయడంతో దృశ్యాలు కానరాలేదని తెలిపారు. వెంటనే భర్త వద్దకు బయలుదేరిన రవళి పక్కింటి వాళకు ఫోన్లు చేస్తూ భర్తను కాపాడాలని వేడుకుందని చెప్పారు. ఇంటికి చేరుకునేప్పటికే భర్త మృతి చెందడంతో ఆమె కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని సీఐ వెంకటేశ్వరు తెలియజేశారు.

ఇవీ చదవండి:కాళ్లు, చేతులు కట్టేసి రూ.30 వేలు అపహరణ

చనిపోయినట్టు నటించి చిరుతకు షాకిచ్చిన శునకం

ABOUT THE AUTHOR

...view details