Youngman Suicide in koti: పెళ్లి కాలేదని మనస్తాపంతో పాతికేళ్లకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ కోఠిలోని ఆంధ్రా బ్యాంకు కూడలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే నూతనంగా నిర్మించిన ఓ షాపింగ్ మాల్ సెంటర్ భవనం ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్(25)గా గుర్తించారు.
పెళ్లి కావడం లేదని భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య - కోఠిలో యువకుడు ఆత్మహత్య
Youngman Suicide in koti: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ కోఠిలోని ఆంధ్రాబ్యాంకు కూడలిలో.. ఓ భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.
![పెళ్లి కావడం లేదని భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య Youngman Suicide in koti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14776141-thumbnail-3x2-cr.jpg)
పెళ్లి కావట్లేదని ఆత్మహత్య
ఇంకా పెళ్లి కావడం లేదనే కారణంతోనే డానియల్ మానసికంగా కుంగిపోయినట్లు సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య
ఇదీ చదవండి:యూట్యూబర్‌తో కలిసి పబ్‌కు వెళ్లారు.. కొబ్బరి బొండాల్లో మద్యం తాగారు..