ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కొవిడ్ బారిన పడి మూడు రోజుల క్రితం గుంటూరులో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక గాజువాకకు చెందిన ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా గాజువాక కణితి రోడ్డులో జరిగింది. గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం... పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్(25) ఇంటర్ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్‌లో ఆన్‌లైన్ పార్శిల్ సర్వీసు పని చేస్తున్నాడు. ఆరుగురు మిత్రులతో కలిసి కణితిరోడ్డులో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్ సర్వీసు కొనసాగించాడు.
suicide: కొవిడ్‌తో ప్రేయసి.. ఉరేసుకొని ప్రియుడు..! - విశాఖపట్నం ముఖ్యవార్తలు
ప్రియురాలు కరోనాతో చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా గాజువాక కణితి రోడ్డులో జరిగింది. తన ప్రియురాలు గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని తెలిసి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కడే రూంకిి వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన మిత్రులు రోహిత్ మృతదేహాన్ని చూసి... వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనకాపల్లికి చెందిన యువతి గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని బాధ పడేవాడని, మరో సంబంధం చూసి వివాహం చేస్తామని నచ్చజెప్పామని తండ్రి కృష్ణారావు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంతలోనే ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని వాపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:SUICIDE: తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య