తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుత్​ షాక్​తో యువరైతు దుర్మరణం - తెలంగాణ వార్తలు

వ్యవసాయ బావి మోటారుకు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్​ఘాతానికి గురైన యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్ మండలం అంబగట్టలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విద్యుత్​ షాక్​తో యువరైతు దుర్మరణం
విద్యుత్​ షాక్​తో యువరైతు దుర్మరణం

By

Published : May 14, 2021, 7:21 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్ మండలం అంబగట్టకు చెందిన మడావి శ్రీశైలం (26)కు ఇంటి సమీపంలో వ్యవసాయ బావి ఉంది. బావి మోటారు చెడిపోవటంతో మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న ఎస్సై సాగర్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతునికి భార్య, తొమ్మిది నెలల పాప ఉన్నారు.

ఇదీ చదవండి:రాజ్​భవన్​లో మిఠాయిలు పంపిణీ చేసిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details