తెలంగాణ

telangana

ETV Bharat / crime

సరదా కోసం చేసిన పని యువకుడి ప్రాణం తీసింది - హైదరాబాద్​ తాజా వార్తలు

రైల్వేలైన్​ హై టెన్షన్​ వైర్లు తగిలి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సరదా కోసం చేసిన పని యువకుడి ప్రాణం తీసింది
సరదా కోసం చేసిన పని యువకుడి ప్రాణం తీసింది

By

Published : Jun 13, 2021, 4:11 PM IST

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని బద్వేలు రైల్వేస్టేషన్​లో ఆగివున్న గూడ్స్ రైలు పెట్రోల్ ట్యాంకర్​ను ఓ యువకుడు ఎక్కాడు. పైకి ఎక్కి ఒక దానిపై నుంచి మరొక దానికి దాటుతుండగా పైనున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

బద్వేలు, శ్రీరామ్​నగర్​కు చెందిన యువకుడు గౌని ప్రవీణ్(19) సరదా కోసం చేసిన పనితో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో తలసాని సందర్శన

ABOUT THE AUTHOR

...view details