తెలంగాణ

telangana

ETV Bharat / crime

suicide: ప్రియుడి చావు రోజే.. ప్రియురాలి నిశ్చితార్థం - తెలంగాణ వార్తలు

ఓ యువకుడు నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. కాని తర్వాత తెలిసింది అతడి చావుకు ప్రేమే కారణమని..

suicide
వినయ్​, ఆత్మహత్య

By

Published : Jul 3, 2021, 11:21 PM IST

Updated : Jul 4, 2021, 1:01 PM IST

suicide: ప్రియుడి చావు రోజే.. ప్రియురాలి నిశ్చితార్థం

నాలుగు రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యువకుడు...అంత్యక్రియలు కూడా జరిగాయి... కథ అడ్డం తిరిగింది. ప్రేమ వ్యవహారమే యువకుడి ఆత్మహత్య కు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆ యువకుడి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.ఈ ప్రేమ కథా చిత్రం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రియురాలి కోసం ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిష్టాపూర్​కు చెందిన వినయ్(23) అనే యువకుడు గత నెల 29వ తేదీన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతడిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమించటంతో వికారాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఆ మరుసటి రోజు యువకుడి ఫోన్ వాట్సప్ చెక్ చేయగా.. అసలు విషయం తెలిసింది.. అతడి చావుకు ప్రేమే కారణమని. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(20)తో వినయ్​ ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. "ఇద్దరం కలిసి చనిపోదాం.. నేను పురుగుల మందు తాగుతున్నా.. నీవు తాగు.. భూమిలో కలిసి పోదాం" అంటూ యువతి యువకుడితో పదే పదే చాటింగ్ చేసిన విషయం గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కలిసి అంత్యక్రియలు జరిగిన నాలుగో రోజు యువకుడి శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పదే పదే ఆత్మహత్య చేసుకుందామని ఆ యువతి పురమాయించినందుకే తమ అబ్బాయి చనిపోయాడని.. తమ అబ్బాయి అంత్యక్రియల రోజే ఆ అమ్మాయి నిశ్చితార్థం జరిగిందని.. యువకుడి అడ్డు తొలగించుకోవాలని ఆత్మహత్యకు పురమాయించిందని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో మరొకరు అమ్మాయిల వలలో పడి తనువు చాలించకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నా కొడుకుకు ఫోన్​ చేసి నేను చనిపోతున్నానని ఆ అమ్మాయి చెప్పింది. సీసాలో మందు పోసి ఫొటోను నా కొడుక్కు పంపింది. నేను తాగుతున్నా.. నువ్వు తాగమంది. అమ్మాయి మందు తాగిందనుకొని నా కుమారుడు పురుగుల మందు తాగాడు.

-లలిత, వినయ్​ తల్లి

ఇదీ చదవండి:'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టే'

Last Updated : Jul 4, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details