తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమానవీయం.. గోవుపై కామాంధుని అఘాయిత్యం.. ఊపిరాడక మూగజీవి మృతి..! - గోవుపై కామాంధుని అఘాయిత్యం

Rape on Cow: "మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు" అని ఎంతో సులువుగా అనేస్తుంటాం. కానీ.. అధమస్థాయికి దిగజారుతున్న మనుషులను పశువులతో పోలుస్తూ.. వాటిని కించపరుస్తున్నందుకు సిగ్గుపడాలేమో..? "విచక్షణ మరిచి పశువాంఛ తీర్చుకున్నాడు" అని స్టేట్​మెంట్​ పాస్​ చేసేస్తాం.. మరి తన కామవాంఛను ఓ పాలిచ్చే పశువుపై తీర్చుకున్న ఈ కామాంధుని వికృత చర్యను దేనితో పోల్చాలో మరి..?

a young boy attempted rape on a Cow and it died at pipri village
a young boy attempted rape on a Cow and it died at pipri village

By

Published : Mar 31, 2022, 5:30 PM IST

Rape on Cow: కామంతో కళ్లు మూసుకుపోయిన మందుబాబు దుశ్చర్యకు ఓ ఆవు బలైంది. ఈ అమానవీయ ఘటన నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ స్థానికుడు ఇళ్లు నిర్మించుకుంటున్నాడు. కాగా.. ఇంట్లో టైల్స్​ వేసే పనిని ఉత్తరప్రదేశ్​కు చెందిన విజయ్ (20) అనే యువకుడు నిర్వహిస్తున్నాడు. రోజూలాగే టైల్స్ వేసే పని చేస్తున్న విజయ్​.. నిన్న(మార్చి 29) కూడా పని ముగించుకున్నాడు. రాత్రి పూట మద్యం సేవించాడు. మత్తులో ఉన్న విజయ్​.. నిర్మాణంలో ఉన్న ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న ఆవును చూశాడు.

మైకం మనిషిని క్రూరమృగంగా మారుస్తుందని మాట నిజమైంది. విజయ్​ను ఆవరించిన మత్తు అతన్ని ఓ సైకోగా మార్చేసింది. తనలో పుట్టిన కామవాంఛ తీర్చుకునేందుకు.. పాలిచ్చే గోవును ఎంచుకున్నాడు ఆ మృగాడు. ఇంటి ఆవరణలో కనిపించిన ఆవును లోపలి వైపు లాక్కొచ్చాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిలోని ఒక కిటికీకి ఆవును కట్టేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి పాలిచ్చే పశువుపైకే ఎగబడ్డాడు. బెదిరిపోయిన ఆవు.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కిటికీకి కట్టేసిన తాడు.. ఆవు మెడకు గట్టిగా చుట్టుకోవడంతో ఉరి పడింది. దీంతో.. ఊపిరాడక మూగజీవి మృతి చెందింది.

పొద్దున్నే ఆ ఆవు యజమాని వచ్చి కట్టేసిన స్థలానికి వచ్చి చూసేసరికి అక్కడ కనిపించలేదు. నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి చూడగా.. విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

గోమాతగా పూజించుకునే ఆవు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోవటంతో.. రైతుతో పాటు స్థానికులంతా బాధపడ్డారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఊరేగింపుగా తీసుకెళ్లి గోమాతకు బరువెక్కిన హృదయాలతో అంతిమసంస్కారాలు నిర్వహించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details