తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఓ కార్మికుడి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీసుకుని - hanamkonda district latest crime news

Suicide Selfie Video: ఓ కార్మికుడు మనస్తాపంతో సెల్ఫీ ​వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు యత్నించాడు. హనుమకొండ జిల్లాకు చెందిన సాంబరాజు బండలు కొట్టి జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు బండలు కొట్టేందుకు పేలుడు పదార్ధాలను వినియోగిస్తున్నారని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈఎమ్​ఐ కట్టలేదని ట్రాక్టర్‌ ఫైనాన్స్ కంపెనీ వారు తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన సాంబరాజు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం బాధితుడి సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

సాంబరాజు
సాంబరాజు

By

Published : Aug 10, 2022, 1:28 PM IST

Suicide Selfie Video: ఓ కార్మికుడు మనస్తాపంతో సెల్ఫీ ​వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెరిగూడెంకు చెందిన సాంబరాజు, అంజయ్య, ప్రభాకర్‌ గ్రామంలోని బోడగుట్టపై బండలు కొడుతూ జీవిస్తుంటారు. ఐతే వీరు బండలు కొట్టేందుకు జిలిటెన్‌స్టిక్స్‌, డిటోనేటర్లు వినియోగిస్తున్నారని పోలీసులకు సోమవారం సమాచారం అందిది.

దీంతో ఐనవోలు ఎస్సై వెంకన్న వడ్డెరిగూడెంలో సోదాలు జరిపి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిపై కేసు కూడా నమోదు చేశారు. మరుసటి రోజు కంప్రెషర్‌ ట్రాక్టర్లను స్టేషన్​కు తీసుకురావాలని ఎస్సై సూచించారు. మరోవైపు నిన్న ఈఎమ్​ఐ కట్టలేదని సాంబరాజుకు చెందిన ట్రాక్టర్​ను ఫైనాన్స్ కంపెనీ వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వైపు ట్రాక్టర్ పోవడం.. మరో వైపు కేసు నమోదు కావడం వల్ల తాను ఎలా బతికేదంటూ సాంబరాజు ఆందోళనకు గురయ్యాడు.

ఈ క్రమంలో బోడగుట్టకు వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకుంటూ సాంబరాజు పురుగుల మందు తాగాడు. తాను పురుగుల మందు తాగానని స్నేహితులు చెప్పడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకొని అతడిని ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాంబరాజుకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుతూరు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై వెంకన్నను వివరణ కొరగా లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని.. మరోసారి వాటిని వాడవద్దని చెప్పామని తెలిపారు. బాధితుడి సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఓ కార్మికుడి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీసుకుని

ABOUT THE AUTHOR

...view details