మహబూబాబాద్ పట్టణానికి చెందిన సుజాత భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఇద్దరు కుమారులు డిగ్రీ చదువుతున్నారు. సుజాతకు తన అన్న చేదోడు, వాదోడుగా ఉండేవాడు. ఇటీవల అన్న మరణించాడు. మనస్తాపానికి గురైన సుజాత.. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టణ శివారులోని రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న షీ-టీమ్స్ బృందం మహిళను రక్షించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన షీ-టీమ్ బృందం - mahabubabad district latest news
మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని రైలు పట్టాలపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన షీ-టీమ్స్ బృందం ఆమెను కాపాడింది.
![మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన షీ-టీమ్ బృందం a women suicide attempt at mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11073847-971-11073847-1616151094617.jpg)
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన షీ-టీమ్ బృందం
మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై.. బాధిత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి.. పంపించారు.