తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE: కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య! - medchal district latest news

కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. దంపతుల ప్రాణాలను హరించి.. పిల్లలను అనాథలుగా మారుస్తోంది. ఇంట్లో వారికి వైరస్​ సోకి వారికి ఏదైనా జరిగితే.. ఆ బాధను దిగమింగుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి విషాద ఘటనే హైదరాబాద్​ శివారు జవహర్​నగర్​ దమ్మాయిగూడలో చోటుచేసుకుంది.

కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య!
కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య!

By

Published : Jun 12, 2021, 5:21 AM IST

దమ్మాయిగూడలో నివసించే సుబ్రహ్మణ్యం, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండు వారాల క్రితం కరోనాతో సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పెద్ద లేడన్న విషయాన్ని అరుణ తట్టుకోలేకపోయింది. చిన్న పిల్లలను ఎలా పోషించాలన్న ఆలోచన ఒకవైపు, భర్త చనిపోయాడన్న బాధ మరోవైపు ఉండటంతో అరుణ తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలోనే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఎవరూ లేకపోవడంతో పోస్టుమార్టం అనంతరం పోలీసులే అల్వాల్​ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: Accident: ఆ కంపెనీకి పనిచేస్తున్న వాహనం ఢీ.. ఇద్దరు స్పాట్​ డెడ్​

ABOUT THE AUTHOR

...view details